Nov 12,2023 15:10

అమరావతి : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలైన సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన బలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని బలెరో వాహనం డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును డీ కొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో పాదచారులు ముగ్గురు మరణించగా, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బలెరో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మఅతదేహాలను, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.