
హైదరాబాద్ : 'కర్నాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా ?' అని తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ ... వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బిజెపి హామీ ఏమైంది ? అని ప్రశ్నించారు. కర్నాటకను మోడల్‌గా కాంగ్రెస్ నేతలు చూపుతున్నారనీ.. కర్నాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. వారికి తాము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామని ఆరోపించడం సరికాదన్నారు. ''కర్నాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా ?'' అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.