Oct 02,2023 15:36

సూర్యాపేట: కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి మాట్లాడారు. ''కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి. ఎవరికి డిపాజిట్‌ రాదో తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి సవాల్‌ చేస్తున్నా. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.. ఏం టైమ్‌కు పోయినా ఓకే. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది. కరెంటు ఉందో లేదో. వారంటీ లేని గ్యారంటీలు కాంగ్రెస్‌ పార్టీవి. ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా మళ్లీ ఆరు గ్యారంటీలా?. ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు. ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే. అద్భుతాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీది వారసత్వ రాజకీయమే. మాది మహాత్మా గాంధీ వారసత్వం.. మోడీదీ గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. మంత్రి జగదీష్‌ రెడ్డి చేసిన సేవ, అభివద్ధికి 50 వేల మెజార్టీతో గెలిపించాలి.'' అని కేటీఆర్‌ కోరారు.