
'ఇంతవరకు నేను ఆరు సినిమాలు చేసాను. అంటే ఒక ఓవర్ అయిపొయింది అన్నమాట, ఇప్పుడు ఈ 'భగవంత్ కేసరి'తో రెండో ఓవర్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందు అన్ని సినిమాల్లో ఎంటర్ టైనమెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, భావోద్వేగాలను తక్కువ చూపించాను, ఈ సినిమా భావోద్వేగాలు ఎక్కువగా వున్న సినిమా. ఇది చాలా నిజాయితీతో చేసిన సినిమా. ఒక మంచి కథ, చాలాకాలం పాటు గుర్తుండిపోయే సినిమా. ఇప్పుడు అమ్మాయిలు ఆర్మీకి వెళుతున్నారు. ఆ కోణంలోనే శ్రీలీల ఆర్మీ పాత్ర ఉంటుంది. ఈ సినిమా కథ కోసం చాలా డాక్యుమెంటరీలు చూసాను. వాటి నుండి చాలా స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నాను' అంటూ 'భగవంత్ కేసరి' చిత్ర విశేషాలు చెప్పారు అనిల్ రావిపూడి. బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల ముఖ్యమైన పాత్రలో, కాజల్ అగర్వాల్ కథానాయికగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు.