స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి' రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం 'కిడ'ా తెలుగులో దీపావళి పేరుతో వస్తోంది. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ విలేకరులతో మాట్లాడారు. 'మాది మధురై జిల్లాలోని రామనాథపురం. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. తాతయ్య, నాన్నమ్మ, అమ్మ వాళ్లే నన్ను పెంచారు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో 2003లో చెన్నైలో అడుగు పెట్టాను. ఓ ఫ్రెండ్ సహాయంతో, డైరెక్టర్ ఎళిల్ దగ్గర ఆఫీస్ బారుగా చేరాను. నాలుగైదేళ్లు తరువాత మరో డైరెక్టర్ దగ్గరకు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. తర్వాత అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగాను. ఓసారి స్నేహితులతో కలిసి సినిమా చూస్తున్న క్రమంలో 'దీపావళి' కథకు సంబంధించిన ఆలోచన పుట్టింది. నిర్మాత వేణుకు చెబితే, ఆయన స్రవంతి రవికిశోర్‌కు చెప్పారు. ఆయన నాతో మాట్లాడటంతో కథ ఓకే అయ్యింది. ఇది చాలామంచి సినిమా. దీనిని తీయటం చాలా గర్వంగా ఉంది' అని వివరించారు.