Oct 24,2023 19:09

విజయ్ తన 68వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో తెరకెక్కించనున్నారు. దసరా రోజు ఈ సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈ సినిమా స్టార్‌ కాస్ట్‌ని కూడా చిత్రబృందం ప్రకటించింది. విజరు హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తున్నారు. ప్రభుదేవా, స్నేహ, లైలా, జైరాం ప్రభుదేవా, ప్రశాంత్‌, యోగి బాబు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఏ జి ఎస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మాణం వహిస్తోంది.