
విజయవాడ : టిప్పర్ లారీ వేగంగా వెళుతూ రోడ్డుపై ఉన్న రైల్వే పోల్‌ని ఢీకొనడంతో లారీలో క్లీనర్ ఇరుక్కుపోయిన ఘటన బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ బస్టాండ్ సమీపాన రాజీవ్ గాంధీ పార్క్ వద్ద చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, టాస్క్‌ఫోర్స్ సిఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ హుస్సేన్ లు చేరుకున్నారు. రెండు జెసిబి లు ఒక క్రేన్ సాయంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను బయటకు తీసేందుకు రెండు గంటల నుండి ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.