Aug 05,2023 13:56

వారణాసి : జ్ఞానవాపి మసీదులో రెండో రోజు సర్వే ప్రారంభమైంది. ఈ మసీదులో ప్రాచీన శివాలయం ఉందా లేదా అన్న అంశంపై పురావాస్తు శాఖ సర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే. నిన్న (శుక్రవారం) ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు సర్వే చేపట్టారు. ఈ సర్వేను రెండోజు (శనివారం) కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ సర్వే సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని గవర్నమెంట్‌ కౌన్సిల్‌ రాజేశ్‌ మిశ్రా తెలిపారు.
కాగా, తాజాగా జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వేను ఆపాలని ముస్లింలు కోరినా.. సుప్రీం ధర్మాసనం స్టే ఇవ్వలేదు.