హీరో వైష్ణవ్‌తేజ్, హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ సినిమాలోని 'లీలమ్మో' అంటూ సాగే మూడో పాటను చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ..'ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ సెట్‌కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది' అని అన్నారు. కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. 'ఇప్పుడే అమ్మవారి దసరా అయ్యింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా 'ఆదికేశవ' వస్తుంది. 'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట. ఈ సాంగ్ మీరందరూ ఎంజారు చేస్తారు. వైష్ణవ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది.'' అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా మాట్లాడారు.