Jun 09,2023 12:38

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : కౌలు రైతు చట్టాన్ని సవరించాలని, భూ యజమాని సంతకం ఉంటేనే కౌలుకార్డులు (సీసీఆర్సీ) ఇస్తామనే నిబంధన తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘల అధ్యక్షులు వై.రాధాకఅష్ణ అన్నారు. ఈ సందర్భంగా యడవల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం వై.రాధాకఅష్ణ మాట్లాడుతూ ... సరళీకఅత ఆర్థిక విధానాల రాకతో వ్యవసాయం నష్టాల పాలవటం జరిగిందన్నారు. దానికి తోడు యజమానులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వఅత్తులు ప్రాంతాలకు వెళ్తే, అప్పటి నుంచి ఈ కౌలు రైతులు కూలీ, నాలి చేసుకునే దళితులు ధరలు పెరగటం రుణ పరపతి లేకపోవడం, ప్రకఅతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటల భీమా, నష్ట పరిహారాలను ప్రభుత్వం నుంచి తగినంతగా అందక పోవటంతో కౌలు రైతులు తీవ్ర నష్టాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గైడెన్స్‌ ప్రకారం 1,60 వేల రూపాయల వరకు హామీలేని రుణాలు ఇవ్వాలన్నారు. పంట స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు మంజూరు చేయాలన్నారు. గతంలో రుణ అర్హత కార్డులు, సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చి కొత్త కౌలు రైతులకు ఉపయోగపడ్డాయి అన్నారు. ప్రస్తుత ఈ ప్రభుత్వం గతంలో ఉన్న కౌలు చట్టాలను రద్దు చేసి అన్యాయం చేసిందన్నారు. పైగా భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు కార్డులు (సిసిఆర్సి) ఇస్తామని నిబంధన చేర్చడం అన్యాయం అన్నారు. కార్డులు లేకపోతే కౌలు రైతులకు పంటల రుణాలు, పంటల భీమా నష్టపరిహారములు, రైతు భరోసా ఏమీ రావటము లేదని అన్నారు. అంటే సిసిఆర్సి కార్డు రాకపోతే ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఏ పంట రుణాలు గాని, నష్టపరిహారాలు కానీ రావన్నారు. కౌలు రైతులకు కష్టాలు తీరాలంటే కౌలు చట్టాన్ని తప్పనిసరిగా మార్చాలన్నారు. భూ యజమాని సంతకం అనే నిబంధన కచ్చితముగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సభ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రతి కౌలు రైతుకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం గ్యారంటీ లేకుండా పంట రుణాలు ఇవ్వాలన్నారు. అంతేకాకుండా పంటల బీమా నష్టపరిహారము, పంటలను అమ్ముకునే అవకాశం కల్పించాలన్నారు. పెరిగిన ధరల రీత్యా కౌలు రైతులకు భరోసాను 25 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహా రుణ విముక్తి చట్టాన్ని చేసి కౌలు సన్న చిన్న కారు రైతులు రుణాలు రద్దు చేయాలన్నారు. దేవాలయ భూముల కౌలు రైతులందరికీ కార్డులు రుణాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు జి లక్ష్మీపతి స్థానిక నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు,యడవల్లి గ్రామ రైతులు వెంకట్రావు గ్రామ రైతు లు తదితరులు పాల్గొన్నారు..