Jul 28,2022 13:47

ప్రజాశక్తి -విశాఖపట్నం : విశాఖపట్నంలోని చైతన్య నగర్‌లో గల ఎస్‌విఎల్‌టి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో భవనం పైకప్పు పెచ్చులూడి పడింది. ఈ సంఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఎస్‌విఎల్‌టి స్కూల్‌కు చెందిన ఒకటో తరగతి విద్యార్థులు చదువుతున్న గది స్లాబ్‌పెచ్చులు పడి ముగ్గురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్కూల్‌ యాజమాన్యం గాయపడిన విద్యార్థులను దగ్గరలోన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు.

school