Jun 06,2023 11:56

బాపట్ల : బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని నర్సాయపాలెం, కంకటపాలెం, మురుకుంటపాడు గ్రామాల్లోని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో నేతలు మంగళవారం ఉదయం వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. కూలీల ఆన్‌లైన్‌ ఫొటో పద్ధతిని ఎత్తివేయాలని కోరారు. వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత పనులు బాగా తగ్గిపోయాయని వందరోజులకి తగ్గకుండా పని చూపించాలని అన్నారు. డబ్బులు రెగ్యులర్‌గా వచ్చే విధంగా చూడాలని, గత సంవత్సరం కొద్ది మందికి పనిచేసిన వారికి డబ్బులు రాలేదని, కూలీలు తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.