Aug 15,2023 14:25

ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : స్థానిక పట్టాభి అగ్రో పుడ్స్‌ లోహిత బ్రాండ్‌ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయిని కే శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సభలో సంస్థ డీజీఎం జి వెంకటరమణ, సుబ్రహ్మణ్యంల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో కె.సాయి వీరేంద్ర(ప్రధమ), సిహెచ్‌ సాయి సూర్య(ద్వితీయ), పి.ఉదయ చంద్రిక (తృతీయ), ఎన్‌.సందీప్‌, అరవింద సాయి ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్‌ టీచర్‌ భాస్కర మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.