'లైఫ్ ఆఫ్ పై'. మేము ఆదివారాలు, సెలవు రోజుల్లో మంచి సినిమాలు చూడడం మొదలుపెట్టాం. ఆ క్రమంలో ఈ మధ్య అవార్డు పొందిన చిత్రం 'లైఫ్ ఆఫ్ పై' అనే సినిమాను చూసాం. ఇది భారత దేశాని (పాండిచ్చేరి)కి చెందిన ఒక పదహారు సంవత్సరాల పై అనే అతని కథ. కెనడా రచయిత యాన్ మార్టిన్ దీనిని రాసారని తెలిసింది. సినిమా చిత్రీకరణ ఎంతో బావుంది. అందరూ చూడ తగిన సినిమా ఇది. లైఫ్ ఆఫ్ పై అనే నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం ముఖ్య సారాంశం ఏమిటంటే...
పై అనే పిల్లవాడు స్కూల్‌కి రోజు వెళ్తాడు. ఆ పిల్లవాడికి ఏమీ రాదు. ఒకరోజు పిల్లవాడికి పరీక్షలు పెడతారు. అందరికంటే ఆ పిల్లవాడే ముందు వస్తాడు. వాళ్ళ నాన్నకి ఒక జూ ఉంది. అందులో చాలా జంతువులు ఉన్నాయి. వాటిలో ఒక పులి కూడా ఉంది. ఒకరోజు ఆ పులి ఉన్న చోటుకు వెళ్తాడు. ఆ పులికి ఆహారం ఇవ్వబోతున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి పైని తీసుకువెళ్తాడు. వాళ్ల కుటుంబం వేరే దేశానికి వెళ్తారు అక్కడ ఓడ ఎక్కుతారు. సగం దూరం వెళ్లిన తరువాత ఓడ మునిగిపోతుంది. తన కుటుంబీకులంతా ఓడలో మునిగి చనిపోతారు. ఆ పిల్లవాడు లైఫ్ బోట్‌లోకి వెళ్తాడు. ఆ పడవలో పులి కూడా ఉంది. దాదాపు ఒక రెండు వారాలు లైఫ్ బోట్‌తో ఆ నీళ్లలోనే ఉంటాడు. తర్వాత ఒక అడవి దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ కావాల్సిన తిండి పదార్థాలు తీసుకొని తర్వాత బోట్ ప్రయాణం కొనసాగిస్తాడు. మళ్ళీ వేరే ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ ఆ పులి దిగి అడవిలోకి విడిపోతుంది వాడు అలసిపోయి అక్కడే పడిపోతాడు. కొంతమంది వచ్చి వాడిని హాస్పటల్లో చేరుస్తారు అలా అయిపోతుంది.పై అనే బాలుడు సముద్రంపై ఒంటరిగా పులితో కలిసి చాలాకాలం పాటు ఎలా కష్టపడి జీవిస్తాడో ఈ కధ తెలియజేస్తుంది. ఈ సినిమా నాకు బాగా నచ్చింది.
ఎస్. మోహిత్ రెడ్డి,
7వ తరగతి, అరవింద స్కూల్,
కుంచన పల్లి.