Aug 21,2023 14:40

ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్యజిల్లా) : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నెరవేర్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్దతిప్పసముద్రం మండలంలోని ఉప్పరోళ్లపల్లి, మల్లెల, మల్లెల క్రాస్‌ సచివాలయ పరిధిలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో వైసిపి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, కుల, మత, రాజకీయాలకతీతంగా వాటిని అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇక తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత 40 దశాబ్దాలుగా జరగనటువంటి అభివద్ధిని కేవలం మూడు సంవత్సరాలలో చేసి చూపించామన్నారు. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతులు కల్పించామన్నారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించి,సంక్షేమ పథకాలను సకాలంలో అందజేయాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీపీ ఖలీల్‌ అహ్మద్‌, గుడిపల్లి సర్పంచ్‌ గిరిజ రఘునాథ్‌, ఎంపీడీవో శంకరయ్య, నాలుగో సచివాలయం కన్వీనర్‌ కంచి కళ్యాణ్‌ కుమార్‌ రెడ్డి, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ భాష, మండల ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్‌ కుమార్‌ రెడ్డి, నియోజవర్గం సేవాదళ్‌ అధ్యక్షుడు సల్మాన్‌,ఎంపీపీ మహమ్మద్‌, జడ్పిటిసి శివన్న, సర్పంచులు, టి.సదుం ఎంపీటీసీ జయలలిత మంజునాథ్‌, యస్‌ ఫయాజ్‌, నక్క మహేష్‌ , సబ్జీ, అభిలాష్‌ రెడ్డి, సద్దాం,పవన్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.