
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నలుగురు ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 1626ను ఆదివారం విడుదల చేసింది. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్టుమెంట్ కమిషనరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి వాణీమోహన్‌ను ఆర్కియాలజీ అండ్ మ్యూజియం కమిషనరుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. రవాణా, రోడ్లు, భవనాలశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్నను యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం కల్చరల్ డిపార్టుమెంట్ కమిషనరుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. స్పోర్ట్స్ అథారిటీ విసి అండ్ ఎమ్‌డి కె హర్షవర్థన్‌ను ఎపి స్టేట్ ఎస్‌సి కమిషన్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ అడిషనల్ డైరెక్టరు హెచ్‌ఎం ధ్యానచంద్రకు స్పోర్ట్స్ అథారిటీ విసి అండ్ ఎమ్‌డిగా అదనపు బాధ్యతలు అప్పజెబుతూ సిఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.