ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారి సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యమని, నిరంతరం కలిసి కట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మేయర్ బీ వై రామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా మాంత్రికుడు మేజర్ ధాన్ చంద్ విగ్రహాన్ని కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకతో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నో సంవత్సరాలుగా దంచంద్ విగ్రహాన్ని స్టేడియంలో ఏర్పాటు చేయాలన్న కళ ఇప్పటికి సాకారం అయిందన్నారు. ధ్యాన్చంద్ స్ఫూర్తితో జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణించడం శుభపరిణామం అన్నారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ . సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందన్నారు. ఎంపీ నిధుల నుంచి జిమ్ ఆధునికరణ కోసం 10 లక్షల రూపాయల అప్రూవల్ లెటర్‌ను క్రీడా శాఖ సీఈఓ రమణకు అందజేశారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడ మౌలిక సదుపాయాలను అందజేసి క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు అనేక పోటీలను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన కృషి వెలకట్టలేని అన్నారు. డిప్యూటీ మేయర్ రేణుక 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతా రెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని అన్నారు. అనంతరం జిల్లా నుంచి ఏషియన్ సాప్ట్ బల్ పోటీలలో పాల్గొన్న కళ్యాణి, జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించిన షర్మిల,అపర్ణ,పరమేష్, వీరేష్, గొల్ల పల్లవి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు శ్రీనివాసరావు, కెవి సుబ్బారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘాల సీఈఓ పి . విజరు కుమార్ ఒలింపిక్ సంఘం కార్యదర్శి గువ్వల శ్రీనివాసులు పలువురు స్టేడియం కోచ్ లు క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడా కారులు , ప్రైవేట్ పాఠశాలల పి ఈ టి లు , వివిద పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











