పింగళి మేధోసంపత్తికి ప్రతీకయై,
భరతదేశ ప్రతిష్టకు ప్రతిరూపమై,
అశోక ధర్మచక్రంతో కూడిన
త్రివర్ణ పతాకం
స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ,
వినీల గగనాన రెపరెపలాడుతూ
అలరిస్తోంది మది నిండుగా.
మంచితనం, మానవత్వం
నైతిక విలువలే సూచికగా.
త్యాగధనుల, నిస్వార్ధుల
పోరాటాల పునాదులపై
స్థిరంగా నిలిచిన ఆ కేతనం
ఉత్తుంగ హిమాలయానికే
తలమానికం.
త్రివర్ణ తేజంతో ఎగిరే ఆ పతాకం
సమతా భావానికి సూచికయై
భరతమాత వ్యక్తిత్వాన్ని చాటే
సందేశాత్మక రూపం.
శతాబ్దాల దాడుల నెదుర్కొని
ఉనికిని ఊగిసలాడనీయకుండా
ధైర్య సాహసాలతో ఎదురొడ్డి నిలిచి
ఉడుంపట్టు పట్టి
స్వతంత్ర సేనానుల సాక్షిగా
స్వేచ్ఛగా తిరుగాడే
భరతమాత సేవలో
పునరంకితమవుదాం..
వేమూరి శ్రీనివాస్
99121 28967