
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. కొద్దిరోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. దుల్కర్ సల్మాన్- మీనాక్షి చౌదరి కాంబోలో 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మాతగా సౌజన్యనే తెరకెక్కిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్-సౌజన్య కుమారుడు రిషీ మనోజ్ దర్శకుడిగా పరిచయం కానున్నట్లు ధృవీకరించారు. ఇప్పటికే రిషీ పూర్తి స్థాయిలో శిక్షణ పొందాడని ఆమె చెప్పుకొచ్చారు.