
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోయిల వుండేది. అది అందమైన పక్షుల్ని చూసి, తను అందంగా లేనని చాలా బాధ పడేది. కొన్ని రోజులకి వసంతకాలం వచ్చింది. ఆ కోయిల గాంతు సవరించుకొని, ఆనంద పారవశ్యంతో గొంతెత్తి పాడసాగింది. కొద్ది సేపటికీ ఏదో అలికిడీ అనిపించి, చుట్టూ చూసింది. తన చుట్టూ ఎన్నో పక్షులు కనిపించాయి. అవి కోయిల గానామృతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాయి. కోయిలకి చాలా ఆశ్చర్య మేసింది. ఆనందమూ కలిగింది.
'ప్రతి వారిలో కూడా ఏదో గొప్పతనం దాగి వుంటుంది. ఉన్న లోపాన్ని చూసుకొని, బాధపడకూడదు. దాగున్న గొప్పతనాన్ని గుర్తించి, సాధన చేస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారు' అని కోయిల తన మనసులో అనుకుంది. ఇకనుంచి తను బాధ పడకూడదు. గొప్పపేరు తెచ్చుకునేలా తన గానాన్ని ఇంకా బాగా సాధన చేయాలని నిర్ణయించుకుంది. అప్పట్నుంచీ వసంతకాలం రాగానే తన గానామృతంతో ప్రకృతిని పరవశింపజేస్తూ, జంతువులన్నింటి నుండి అభినందనలు అందుకోసాగింది.
- మా శ్రీ రాజు,
పాల్వంచ, 92487 91885.