Jun 04,2023 21:20

ముఖ గుర్తింపు నుంచి ఓపెన్‌ఏఐ యొక్క చాట్‌ జిపిటి, గూగుల్‌ బార్డ్‌ వంటి చాట్‌బాట్‌ల వరకు ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలకు సంబంధించిన సాంకేతికతల పెరుగుదలను ప్రారంభించడంలో జెఫ్రీ హింటన్‌ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధన సహాయపడింది. బ్రిటీష్‌-కెనడియన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త, సాంకేతికత ప్రధాన స్రవంతిలోకి వెళ్లడానికి దశాబ్దాల ముందు నాడీ నెట్‌వర్క్‌ల - కాంప్లెక్స్‌ కంప్యూటర్‌ మోడళ్లలో లేయర్డ్‌ నిర్మాణాలు మానవ మెదడును అనుకరించే అధ్యయనానికి తన వృత్తిని అంకితం చేశారు. అందువల్లన హింటన్‌ 'ఏఐ గాడ్‌ఫాదర్‌ అనే బిరుదు సంపాదించాడు. అయితే హింటన్‌ గత నెలలో గూగుల్‌లో దశాబ్దం పాటు కొనసాగిన ఆయన తన 75ఏళ్ల వయస్సులో పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ యొక్క ప్రమాదాల గురించి స్వేచ్ఛగా చర్చించగలనని చెప్పాడు. ఏఐ రంగంలో జరుగుతున్న పరిణామాల నుంచి పెరుగుతున్న ప్రమాదాల గురించి హెచ్చరించాడు. ఏఐ చాట్‌బాట్‌ల యొక్క కొన్ని ప్రమాదాలు చాలా భయానకంగా వుంటాయని ఆయన చెప్పాడు.
కృత్రిమ మేధలో న్యూరల్‌ నెట్‌వర్క్‌లు సమాచారాన్ని నేర్చుకునే, ప్రాసెస్‌ చేసే విధానంలో మానవ మెదడును పోలి వుండే వ్యవస్థలు. ఇవి ఏఐ లను ఒక వ్యక్తివలే అనుభవం నుంచి నేర్చుకునేలా చేస్తాయి. దీనినే డీప్‌లెర్నింగ్‌ అంటారు. ఇది మెషీన్‌ లెర్నింగ్‌లో ఒక భాగం. సంక్లిష్ట డేటా నుంచి తెలుసుకోడానికి, అంచనాలను రూపొందించడానికి బహుళ లేటర్‌లతో కృత్రిమ నాడీ నెట్‌వర్క్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. ఇది మానవ మెదడు నిర్మాణం, పనితీరు, ప్రత్యేకంగా న్యూరాన్ల పరస్పర అనుసంధానం ద్వారా ప్రేరణ పొందుతుంది.