Dec 18,2022 13:50

దెందులూరు (ఏలూరు) : రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని అశోక్‌ లేలాండ్‌ మ్యాక్సీ క్యాబ్‌ వాహనం ఢీకొట్టడంతో తొమ్మిదిమంది ప్రయాణీకులకు గాయలైన ఘటన ఆదివారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట గ్రామ సమీపంలో జరిగింది. ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం నుండి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు.