హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలకు వరదలు సంభవించి.. దాదాపు 100 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోగా.. కోట్లలో ఆర్థిక నష్టం జరిగిన విషయం తెలిసిందే. వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం అండగా నిలిచింది. రాష్ట్రం వరద ప్రభావం నుంచి కోలుకోవడానికి రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. రూ.180.40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ (ఎస్డీఆర్‌ఎఫ్)కి కేటాయించారు. వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం హిమాచల్ ఎస్డీఆర్‌ఎఫ్‌కి 2023-24 సంవత్సరంలో విడుదల చేయాల్సిన సహాయ నిధిని ముందుగా విడుదల చేయనున్నట్లు అధికారక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే జులై 10న మొదట విడత కింద రూ.180.40 కోట్లను విడుదల చేసింది.










