Nov 07,2023 19:05

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఓటీటీలో ప్రసారం అవుతుందని, నెట్‌ఫిక్స్‌ రూ.8 కోట్లకు ఈ పెళ్లి వీడియోను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఒట్టి రూమర్‌ అని, పెళ్లి వీడియోను ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ చేయడం లేదని వరుణ్‌, లావణ్య పీఆర్‌ టీమ్‌ స్పష్టం చేసింది. 'వరుణ్‌-లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పెళ్లి వీడియో హక్కులను ఏ ఓటీటీ సంస్థకు అమ్మలేదు. దయచేసి అలాంటి బేస్‌లెస్‌ రూమర్స్‌ని నమ్మకండి' అని వరుణ్‌, లావణ్య పీఆర్‌ టీమ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.