Aug 05,2023 16:30

విశాఖపట్నం: ప్రజాశాంతి పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం పార్టీ కార్యాలయంలో కేఏ పాల్‌ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పాల్‌కు వ్యతిరేకంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌, టీడీపీ నేతల నిరసనకు దిగారు. పాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేఏ పాల్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. టీడీపీని, చంద్రబాబు, లోకేశ్‌ను కించపరిచేలాగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో పవన్‌ కళ్యాణ్‌ను కూడా అవమానపరిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్లెక్సీ ముందు ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పాల్‌ మతిస్థిమితం కోల్పోయారని విమర్శలు గుప్పించారు. తక్షణమే కేఏ పాల్‌ క్షమాపణ చెప్పాలని లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు.