
- వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అమిత్ షా
హైదరాబాద్ : హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంకు కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న అమిత్ షా.. తొలుత వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తర్వాత కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సభలో ప్రసగించనున్నారు. ఇక, విమోచ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ సంస్కతి, సంప్రదాయం ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.