Oct 26,2023 10:37
  • ఏడు రోజుల్లో 'హర్‌ కీ డూన్‌' పర్వతం అధిరోహణ
  • తొమ్మిదేళ్ల వయసులోనే రికార్డులకెక్కిన ఆర్షి

హైదరాబాద్‌ : స్కూలుకు వెళ్లే వయసులోనే ఓ చిన్నారి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. అదీ తక్కువ సమయంలో పూర్తిచేసి రికార్డులకెక్కింది. తల్లిదండ్రులతో కలిసి ఏడు రోజుల్లోనే శిఖరాన్ని చేరుకుంది.ఆ చిన్నారి మనకావడం విశేషం. నానక్‌ రామ్‌ గూడలోని ద శ్రీరామ్‌ యూనివర్సల్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆర్షి ఈ ఘనత సాధించింది. ఈ నెల 14న తన తల్లిదండ్రులు అంజనా, సోహన్‌ లతో కలిసి ఉత్తరాఖండ్‌లోని గర్హివాల్‌ లో ట్రెక్కింగ్‌ ప్రారంభించింది. 12 వేల అడుగుల ఎత్తున్న 'హర్‌ కీ డూన్‌' పర్వతాన్ని అధిరోహించడానికి పెద్ద వారికైతే ఐదారు రోజులు, పిల్లలకు పది రోజుల సమయం పడుతుంది. అయితే, ఆర్షి మాత్రం ఏడు రోజుల్లోనే.. అంటే ఈ నెల 21న శిఖరాగ్రం చేరుకుంది. దీంతో ఆర్షి పేరు రికార్డుల్లోకి చేరింది. ఈ ట్రెక్కింగ్‌ పోగ్రాం కోసం ఆర్షికి స్వయంగా ఆరు నెలల పాటు శిక్షణ అందించినట్లు వివరించారు.