Jun 26,2022 13:29

గాంధీనగర్‌ : ఫోర్జరీ, కుట్ర, క్రిమినల్‌ ప్రొసిడింగ్స్‌ను కించపరిచారన్న ఆరోపణలపై అరెస్టు చేసిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కు ఆదివారం గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ (ఎటిఎస్‌) అప్పగించింది. క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ డిబి బరాద్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తీస్తాపై అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. శనివారం సాయంత్రం ముంబయిలోని జుహులోని ఆమె నివాసం నుండి ఎటిఎస్‌ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను గజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తరలించారు. ఆమెను సిటీ బ్రాంచ్‌కు ఆదివారం ఉదయం అప్పగించామని క్రైమ్‌ బ్రాంచ్‌ వర్గాలు తెలిపారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన మరుసటి రోజే ఆమె అరెస్టు జరిగింది. ఆమెతో పాటు గుజరాత్‌ మాజీ డిజిపి శ్రీ కుమార్‌, మరో ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌లను కూడా ఎటిఎస్‌ అరెస్టు చేసిన సంగతి విదితమే.