
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 మూడో ఎడిషన్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఈ అద్భుత విజయం ఫలితంగా డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌పై విజయంతో భారత్ 12 పాయింట్లతో కొత్త పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. అంతకుముందు ఆస్ట్రేలియా 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వడంతో కంగారూల విజయ శాతం 61.11గా ఉంది. దీంతో రెండో స్ధానానికి ఆసీస్ దిగజారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్‌లో ఉండగా.. ఆసీస్, ఇంగ్లండ్ వరుసగా రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.