తను విడిచి
వెళ్ళిన చోటునే..
ప్రతి రోజూ
ఎదురు చూస్తున్నా !
తను రాలేదు..
ఎంత నిలువరించుకున్నా
కాసిన్ని
కన్నీటి చుక్కలు రాలాయి !
తను ఎప్పుడు
అక్షరాలను విత్తెనో..
చుక్కలు తాకిన నేలలో
కవితలు మొలచాయి !
తను
నలుదిక్కులూ వ్యాపించిన
సాహితీ పవనం
అరచేతిలో విరిసిన హరివిల్లు !
- సురేంద్ర రొడ్డ
94915 23570