Aug 05,2023 15:00

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపుతు, జాగ్రత్తలు పాటించాలని భావన ఆసుపత్రి చైల్డ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మల్లికార్జున రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ.. వర్షాల కారణంగా కొత్త,పాత నీరు కలవడం వల్ల ఆ నీరు సేవించిన వారు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కండ్లకలక తీవ్రంగా ఉందన్నారు. అలాంటి లక్షణాలు ఉన్న వారి దరికి పిల్లలను తీసుకోరాదు అన్నారు. పిల్లలకు తరచుగా సబ్బుతో వొళ్ళంతా స్నానం చేయిస్తూ శుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలకు తీవ్రమైన నొప్పి ఏర్పడి జ్వరం వచ్చే అవకాశం ఉందని..ఎక్కువ సమయము చిన్న పిల్లలను ఆరుబయట ఉంచకుండా ఇళ్లలోనే ఉంచాలన్నారు. దగ్గు జ్వరం వచ్చిన సమయంలో వేడి చేసిన నీటీనే త్రాగాలన్నారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా, అతి సార వ్యాధులు పిల్లలకు సోకే అవకాశం ఎక్కువగా ఉందని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమ కాటు బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నపాటి జ్వరం వచ్చిన వెంటనే స్పెషలిస్ట్లను సంప్రదించి పిల్లలకు మెరుగైన వైద్యము చేయించాలన్నారు. ఆదోని పట్టణంలోని ఎస్కేడి కాలనీలో ఉన్న తమ ఆసుపత్రిలో అన్ని రకములైన వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందన్నారు.