హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరీక్షకు నేటి నుంచి (అక్టోబర్ 20) అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత టెస్ట్ నిర్వహించనున్నారు. రెండు పేపర్లుగా జరగనున్న ఈ పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డిలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.