Sep 22,2023 10:58

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అక్రమ అరెస్టుకు నిరసనగా ... ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో టిడిపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, వైసీపీకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో రోడ్డుకిరువైపుల ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.