ప్రజాశక్తి-వీరులపాడు (ఎన్‌టిఆర్) : వీరులపాడు జగన్నాధపురం గ్రామంలో నన్నపనేని వెంకటేశ్వరరావు భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే రంగిరాల సౌమ్యతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ ... వీరులపాడు మండలం జగన్నాధపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నన్నపనేని వెంకటేశ్వరరావు అకాల మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. జగన్నాధపురం గ్రామంలో వెంకటేశ్వరరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కే.శ్రీనివాసరావు, కొప్పుల కోటిరెడ్డి, కాపా రాంబాబు, స్థానిక మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.










