Oct 03,2023 16:22

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్ : చంద్రబాబును అరెస్ట్ చేసి వైసిపి ప్రభుత్వం జైల్లో నిర్బంధించడానికి నిరసిస్తూ మంగళవారం సామర్లకోట భీమేశ్వర ఆలయం ప్రధాన గోదావరి కాలనీ టిడిపి నాయకులు కార్యకర్తలు జోరుగా జల దీక్ష ఆందోళన నిర్వహించారు. టిడిపి జెండాలు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొల లోతు నీటిలో నాయకులు కార్యకర్తలు నిరసన కొనసాగించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కుమార్ స్వామి, బడుగు శ్రీకాంత్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), టిడిపి  నాయకులు గుమ్మల్ల రామకృష్ణ, చీకట్ల వెంకటేష్, అందుగుల జార్జి చక్రవర్తి, గొల్తి సత్యనారాయణ, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.