Sep 14,2023 16:59

ఇంటర్నెట్‌డెస్క్‌ : విటమిన్‌ డి లోపిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే శరీరంలో విటమిన్‌ డి లోపించినట్లు కొన్ని లక్షణాలు తెలుపుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!

విటమిన్‌ డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు.
- ఎముకల నొప్పి, కండరాల నొప్పులతో బాధపడతారు.
- తీవ్రమైన వెన్నునొప్పితో, కీళ్ల నొప్పులతో బాధపడతారు. మానసిక ఆందోళనకు గురవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- తరచూ జలుబు, దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లు సోకుతాయి. నిద్రలేమితో బాధపడతారు.

మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. కచ్చితంగా విటమిన్‌ డి పుష్కలంగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. అలాగే తప్పనిసరిగా ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్‌ డి లోపం వల్లే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.