ఆమె నవ్వు విన్నప్పుడల్లా
స్కూల్ గౌన్ వేసుకున్న పలక గుర్తొస్తుంది..
అ, ఆలకు మాటలొచ్చినట్టు..
ఏ, బి, సి, డి లకు చాక్లెట్ పెట్టినట్టు
ఉంటుందామె ఆకారం...
ఆమెతో సెల్ఫీ కోసం.. క్లాస్‌రూమ్ గోడలు
కూడా ఆవురావురంటూ చూస్తుంటాయి...
ఆమె అలా నడుస్తూ వస్తుంటే మాత్రం
స్కూల్ ఆవరణ బ్రేక్ డాన్స్ చేసినట్టు ఉంటుంది...
అదేం విచిత్రమో కానీ ఆమె వచ్చాక
చీమల జాడే లేదని తెలిసింది..
పసిపిల్లల గుండెల్ని కూడా మాయం చేసిందన్న
ఫిర్యాదులే ఆమె చుట్టూ..
అనుకోకుండా ఆ రోజు ఆమె భుజం తడబడింది..
గుండె బరువెక్కింది... స్కానింగ్ చేసాక తెలిసింది...
ఆమెలో చేరిన కొన్ని వందల గుండెలకు
చీమలు పట్టాయని...
మందులు భారీగానే రాసారేమో...
ఐసీయూ ఆ మాత్రల చీటీని చూసి నవ్వింది...
ప్రేమే కాదు ఇవి కూడా అవసరమంటూ...
రాత్రికో కోపం టాబ్లెట్.. మధ్యాహ్నానికో అరిచే టాబ్లెట్
సాయంత్రానికో నవ్వే టాబ్లెట్ ఇచ్చి పంపించారు...
అందరికీ మనసైన సీతాకోకచిలుక కదా..
ఇచ్చిన బిళ్లల్ని బౌల్లో వేసి
రాముడు, సీతా ఆడుకునేదా
తీపి గుండెకాయ...
ఎంత వయసొచ్చి అమ్మమ్మయినా కూడా...
అమూల్యచందు కప్పగంతు
90598 24800