ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సెప్టెంబర్ 23వ తేదీన తమకు పాప పుట్టిందని, రబియా అనే పేరు పెట్టినట్లు స్వర భాస్కర్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. చిన్నారిని ఎత్తుకుని దిగిన ఫొటోలను షేర్ చేసి.. 'మా ప్రార్థనలన్నీ ఫలించాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. దీంతో స్వర భాస్కర్, ఫహద్ అహ్మద్ దంపతులకు పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, నటి స్వర భాస్కర్ సమాజ్‌వాది పార్టీ నాయకుడైన ఫహద్ అహ్మద్‌లు ప్రత్యేక వివాహ చట్టం కింద జనవరి 6వ తేదీన వివాహం చేసుకున్నారు.










