Oct 27,2023 07:59

సూర్య హీరోగా తన 43వ చిత్రాన్ని సుధా కొంగరతో చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. తాజాగా గురువారం ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఇందులో సూర్యతో పాటుగా దుల్కర్‌ సల్మాన్‌, నజ్రియా ఫహద్‌ కనిపించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్‌ సంగీతం అందించనున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కానుంది.