సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను 10 భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. థారులాండ్‌లోని దట్టమైన అడవుల్లో మూడు వారాల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.










