ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బ్రష్ చేస్తున్నా.. దంత సమస్యలతో బాధపడుతుంటారు. పంటి సమస్యలు ఎదురైనప్పుడుల్లా డాక్టర్ల దగ్గరకు వెళ్లలేరు. అందుకే పంటి సమస్యల్ని పంటిబిగువున భరిస్తూ ఉంటారు. ప్రతిసారీ మందులతో కాకుండా.. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనూ దంత సమస్యల్ని నివారించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..!
జామ ఆకు
జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు కొన్ని జామ ఆకుల్ని రెండు, మూడు నిమిషాలపాటు నమిలితే.. దంత సమస్యలు దూరమవుతాయి. ఒకవేళ మీకు జామ ఆకుల్ని నమలడం ఇష్టం లేకపోతే.. ఒక కప్పు నీటిలో నాలుగైదు జామ ఆకుల్ని వేసి ఉడకబెట్టి ఆ నీటిని రోజూ మీరు మౌత్‌వాష్‌గా వాడితే పంటి సమస్యలు మీ దరికి చేరవు.
గ్రీన్ టీ
చక్కెర లేకుండా గ్రీన్ టీని తయారు చేసి, రోజుకు రెండుసార్లు మౌత్ వాష్‌గా ఉపయోగిస్తే.. పంటి నొప్పిని నివారుస్తుంది.
వెల్లుల్లి
రెండు మూడు లవంగాలను, వెల్లుల్లిని కలిపి పేస్ట్‌లా చేసి, అందులో కొన్ని చుక్కల నీళ్లు పోసి దంతాల మీద అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత, గోరువెచ్చని ఉప్పు నీటితో మీ దంతాలను శుభ్రం చేసుకుంటే.. దంత సమస్యలకు చెక్ పెట్టొచు. వెల్లులోని అల్లిసిన్ దంత సమస్యలకు కారకమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది.
పసుపు
అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు, కొద్దిగా ఆవాల నూనె కలిపి పేస్ట్‌లా చేసి రోజుకు రెండుసార్లు దంతాల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ దంత సమస్యలు కొద్దిరోజులకు దూరమవుతాయి.