
ప్రజాశక్తి - అనంతపురం : ఆర్భాటంగా ప్రారంభించిన సబ్సిడీ టమోటా విక్రయకేంద్రం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. టమోటా ధరలు అధికంగా ఉండడంతో ప్రజలకు రూ.50కే సబ్సిడీతో అందిస్తామని చెప్పి ఆర్భాటంగా అనంతపురం నగరంలోని పిఆర్‌పి రైతుబజార్‌లో విక్రయ కేంద్రాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ప్రారంభించారు. ఆరోజు అలా ఇచ్చి మరుసటి రోజు నుంచే కేంద్రాన్ని ఖాళీగా ఉంచేశారు. ప్రస్తుతం ఈ కేంద్రం టమోటాలు లేకుండా ఖాళీగా ఉంది. తగినన్ని టమోటాలను అందుబాటులో పెట్టుకోకుండా కొన్ని బాక్సుల్లో తీసుకొచ్చి ఒకరోజు విక్రయాలతో సరిపెట్టారు. ఒక రోజు ముచ్చటకి ఇంత ఆర్భాటం ఎందుకు చేయాలంటూ వినియోగదారులు నిట్టూర్చుతున్నారు.