
ఇంటర్నెట్‌డెస్క్ : షుగర్ స్థాయిలు పెరగకుండా.. బరువు తగ్గేందుకు క్యాలరీలు లేని షుగర్‌ని వాడుతున్నారా? అయితే ఇలాంటి షుగర్ వాడకం వల్ల.. రక్తం గడ్డకట్టే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె నొప్పి వచ్చే అవకాశముందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాలరీలు లేని షుగర్‌ని ఉపయోగించడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలకు గురికావచ్చని తాజా పరిశోధనలో వెల్లడైందని డాక్టర్ స్టాన్లీ హాజెన్ చెప్పారు. 2011లో నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిబిఐ) చేసిన పరిశోధన ప్రకారం క్యాలరీలు తక్కువున్న షుగర్.. నేరుగా నరాల్లోకి వెళుతుందని, అది రక్తం గడ్డ కట్టేలా చేసి గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదముందని డాక్టర్ శ్రీవాస్తవ్ తెలిపారు.