కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో విద్యార్థిని ప్రతిభ : గోల్డ్-సిల్వర్ మెడల్స్ కైవసం

విజయనగరం : సత్యా కళాశాల విద్యార్థిని ఎస్.పల్లవి ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో జరిగిన కామన్వెల్త్‌హొవెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో 64 కేజీల జూనియర్ విభాగములో గోల్డ్ మెడల్, 64 కేజీల సీనియర్ విభాగములో సిల్వర్ మెడల్‌హొ సాధించినది. ఈ పోటీలో కుమారి పల్లవి స్నాచ్‌లో 86 కేజీలు, జర్క్ లో 107 కేజీలు, మొత్తం 193 కేజీలు ఎత్తి బంగారు, వెండి పథకాలను కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బత్స ఝాన్సీ లక్ష్మీ, కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం.శశిభూషణరావు విద్యార్థిని అభినందిస్తూ ధీర, సత్య విద్యాసంస్థల తరపున పల్లవికి పౌష్టికాహారం నిమిత్తం గత ఆరు నెలలుగా నెలకు రూ.30,000 నగదు సహాయం చేస్తున్నట్టు ఈ నెల కూడా 30 వేల రూపాయల నగదును పల్లవి బ్యాంక్ అకౌంట్ కు జమ చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ ... పల్లవికి మంచి భవిష్యత్తు ఉన్నదని, ఈనెల 29 నుంచి భారతదేశంలో జరగబోయే ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో కూడా బాగా రాణించి దేశానికి రాష్ట్రానికి అలాగే విజయనగరం జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. శశిభూషణ్ రావు మాట్లాడుతూ ... పల్లవి జిల్లా స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో బాగా రాణిస్తున్నందుకు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ ఈ నగదు బహుమతిని ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో జరగబోయే పోటీలలో ఎన్నో పతకాలు సాధించాలని ఆశించారు. కోచ్ చల్లా రాము మాట్లాడుతూ ... పల్లవి ఈ అంతర్జాతీయ పథకాలు సాధించడంలో సత్య విద్యాసంస్థల సహాయము ఎంతగానో తోడ్పడిందని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి.సాయి దేవమణి, వైస్ ప్రిన్సిపల్ కెప్టెన్ సత్యవేని అధ్యాపక, అధ్యాపకేతర బఅందం పల్లవిని అభినందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.