May 24,2023 13:33

తెలంగాణ : యుపిఎస్‌సి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించింది. ఉత్తమ ర్యాంకులు సాధించి సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అభినందించారు. వీరంతా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని సిఎం కెసిఆర్‌ ఆకాంక్షించారు. ఇక సివిల్స్‌లో తఅతీయ ర్యాంక్‌ సాధించిన ఉమా హారతిపై హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అభినందనలు తెలిపారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకున్న అనుబంధాన్ని సీవీ ఆనంద్‌ గుర్తు చేసుకున్నారు. ఉమా హారతి విజయాన్ని సాధించినందుకు ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.