ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : స్వాతంత్ర ఫలాలు దేశప్రజలందరికి దక్కె వరకు పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా పేర్కొన్నారు. 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముజఫర్ నగర్‌లోని టిసి లక్ష్మమ్మ కుట్టు సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సిపిఎం సీనియర్ నాయకులు కె ఇసాక్ ఆవిష్కరించారు. సిపిఎం నాయకులు కె సుధాకరప్ప సిహెచ్ సాయిబాబా మహిళా సంఘం నగర అధ్యక్షులు జి ధనలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.సి.ఆనంద్, కె.ప్రభాకర్, వై.సుధాకర్, కె.సురేష్, ఆంజనేయులు, విజరు కుమార్, దావీదు ప్రసాద్, మాదన్న, శివయ్య, మహిళా సంఘం నాయకులు జె.లక్ష్మి బాయి, కె దానమ్మ, యస్ శారదమ్మ, యస్ ఓబులమ్మ, కన్యకా రమణమ్మ కుమారి తదితరులు పాల్గొన్నారు.










