Oct 10,2023 12:01

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌, అంగళ్లు, కేసులలో హైకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగలేదన్నారు. 2018లో జరిగిన కోడి కత్తి కేసులో సుమారు ఐదున్నర సంవత్సరాలు దాటినప్పటికీ శ్రీను బెయిలు నేటికీ రాలేదని సుమారుగా 43 వేల కోట్లు దోపిడీ చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై సిబిఐ, ఎన్ఫోర్స్‌మెంట్‌ కేసులు నమోదు చేసినప్పటికీ బెయిల్‌ పై బయటకు వచ్చి పది సంవత్సరాలు పూర్తయిందన్నారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని పాలన చేస్తున్నారన్నారు. ఫైబర్‌ నెట్‌ కేసు నమోదు చేసినప్పుడు రూ.3 వేల కోట్లు అని తరువాత రూ.370 కోట్లని ప్రస్తుతం రూ.27 కోట్లని చెబుతున్నారని అయితే రూ.27 కోట్లు కూడా చందారూపంలోనే టిడిపి కార్యాలయంకిహొ వచ్చిందని చెబుతున్నారన్నారు. నేటి నుంచి ప్రజాక్షేత్రంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు చంద్రబాబు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ప్రకాష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, గుండు వీర తాతరాజు, బండి గోవిందు, యర్రగతపు బాబ్జి, పిల్లా తాతాలు, రమేష్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.