దానిమ్మ తోట, మోటరు పైప్ లైన్ ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి : సిపిఎం
ప్రజాశక్తి-వెల్దుర్తి (కర్నూలు) : వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మారబోయిని మాధవ స్వామి దానిమ్మ తోట, డ్రిప్ పైప్ లైన్, బోరు మోటారు పైప్ లైన్ ల ను మే 3వ తేదీ రాత్రి ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు నగేష్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతు మాధవస్వామితో కలిసి పొలాన్ని పరిశీలించారు. ఒక నెల రోజులు పంట కోసుకోవాల్సిన సమయంలో దాదాపు 100 దానిమ్మ చెట్లు పొలంలోని మొత్తం డ్రిప్ పైప్ లైన్ లెంతులు, డ్రిప్పు లెంతులు, మోటారు స్టార్టర్ అన్ని ధ్వంసం చేసి రైతుకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాలన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి దానిమ్మ తోటను పెంచుకుంటే ఒక నెలలో కోత కు వస్తే పెట్టిన దాంట్లో కొంత పెట్టుబడి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతు మాధవ స్వామికి దుండగుల రూపంలో తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. పోలీసులు విచారించి దుండగులను పట్టుకొని రైతుకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో బాధిత రైతు కుటుంబంతో కలిసి ఆందోళన కు దిగవలసి వస్తుందని హెచ్చరించారు.










