- అమెరికా తిరస్కృతి
న్యూయార్క్: పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను ఆపాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ్పతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. భద్రతా మండలిలోని 15 దేశాలకు గాను 14 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు చేయగా, అమెరికా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా చర్యపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా మిత్రపక్షాలైన జపాన్, ఫ్రాన్స్ కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడంతో అమెరికా ఈ విషయంలో ఒంటరిపాటైంది.