ప్రజాశక్తి-కాకినాడ : ఈ నెల 16వ తేదీన రాజమండ్రిలో జరగనున్న రాష్ట్రస్థాయి కొబ్బరి రైతుల సదస్సు కరపత్రాలును బుధవారం కాకినాడ సుందరయ్య భవనములో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గురాల అప్పారావు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నాపెడ్, ఆయిల్ పెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొబ్బరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని వర్తింపజేయాలన్నారు. జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు కేరళ తరహాలో సహకార రంగంలో ఏర్పాటు చేయాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొబ్బరి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని ఎర్రనల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్లు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి రైతులకు సబ్సిడీ పథకాలు అందించాలని కొబ్బరి రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వాసంశెట్టి చందర్ రావు, కౌలు రైతు సంఘం అధ్యక్షులు ఎం రాజశేఖర్, రాజా, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారం కోసం 16వ తేదీన జరుగు సదస్సులో కొబ్బరి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయ్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.










